శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతకకరోనా వైరస్ (CoronaVirus) కు సంబంధించిన విషయాలపై సెర్చింజిన్ గూగుల్, యాపిక్ ఫోకస్ చేస్తున్నాయి. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేస్తున్న COVID-19కు సబంధించిన యాప్స్‌ను తమ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసేందుకు నిర్ణయించాయి. గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల వివరాలకు సంబంధించిన యాప్స్ ను మాత్రమే ఉంచి, మిగతా యాప్స్ అందిస్తున్న డేటాను కస్టమర్లకు అందుబాటులో లేకుండా చేసే దిశగా యాపిల్, గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
కరోనా వైరస్‌ల పేరుతో ప్లే స్టోర్లలో అందుబాటులో ఉండే డేటా వల్ల యాప్ యూజర్లు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సంస్థలు భావిస్తున్నాయి.
గూగుల్ ప్లేలో సెర్చ్ చేస్తే 'Coronavirus: Stay informed' పేరుతో ఉన్న వెబ్ సైట్‌లో సీడీసీ, రెడ్ క్రాస్, ట్విట్టర్ సంస్థలు అందించే సమాచారం కనిపిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ సైతం కరోనా వైరస్‌లకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై ఫోకస్ చేస్తున్నాయి. కాగా, భారత్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.

No comments:
Post a Comment