వర్షం కారణంగా భారత్ X ఇంగ్లాండ్ సెమీస్ రద్దు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలిసారి ఫైనల్ చేరింది. భారత్ X ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో హర్మన్‌ప్రీత్‌సేన సెమీస్ ఆడకుండానే నేరుగా ఫైనల్ చేరింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎలో టీమ్‌ఇండియా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలవడంతో మెరుగైన రన్‌రేట్ కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌పైనా నీలినీడలు కమ్ముకొన్నాయి.

No comments:
Post a Comment